BRS: క్వాష్ పిటిషన్‌ డిస్మిస్ చేసిన హైకోర్టు.. సుప్రీం కోర్టుకు కేటీఆర్!

ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) వ్యవహారంలో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది.

Update: 2025-01-07 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) వ్యవహారంలో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్గాల్లో ఓ రకమైన టెన్షన్ నెలకొంది. ఏసీబీ (ACB) అధికారులు కేటీఆర్‌ (KTR)ను అరెస్ట్ చేస్తారా.. ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారనే ఆలోచనలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి.

అయితే, హైకోర్టు (High Court) తీర్పు నేపథ్యంలో ఏం చేద్దామని బీఆర్ఎస్ (BRS) అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నంది నగర్‌లోని కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారాంతా సమావేశమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో భాగంగా సుప్రీం కోర్టుకు వెళ్లాలని కేటీఆర్ (KTR) తన నిర్ణయాన్ని వెల్లడించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇప్పటికే మరోసారి ఏసీబీ నోటీసులు అందుకున్న కేటీఆర్ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేస్తారా..? లేక విచారణకు హాజరు అవుతారా అనే విషయం తేలాల్సి ఉంది.   

Tags:    

Similar News