BRS: కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.. హరీష్ రావు డిమాండ్

ముఖ్యమంత్రి(Telangana CM) ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు మర్చిపోయారా అని, అధికారంలో లేకుంటే ఒక మాట.. ఉంటే మరో మాటనా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు.

Update: 2024-10-28 06:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి(Telangana CM) ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు మర్చిపోయారా అని, అధికారంలో లేకుంటే ఒక మాట.. ఉంటే మరో మాటనా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. పోలీసులను విధుల్లో నుంచి తొలగించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోలీసుల గురించి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఏక్ పోలీసు(Ek Police) విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు(Orders) జారీ చేయడం హేయమైన చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండించారు.

"నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన.. పోలీసుల కష్టాలు నాకు తెల్సు.. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు" అంటూ ఎన్నికల సమయం(Elections Time)లో రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారం లేకుంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? అని నిలదీశారు. భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ(TGSP) సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్(Suspention) చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని(Telangana Govt) డిమాండ్ చేశారు. కాగా ఇటీవల జరిగిన బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై విచారణ జరిపిన అదనపు డీజీ సంజయ్ జైన్(Addl.DG Sanjay Jain) ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైన 10 పోలీసులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 


Tags:    

Similar News