కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్‌లకు సిద్ధమవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్‌లకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. చార్జిషీట్‌ను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేసి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. ఫిర్యాదుల స్వీకరణకు 9240015247 నంబర్‌కు కాల్ చేయాలని బీజేపీ నేతలు కోరారు.
ప్రోగ్రామ్ వివరాలు ఇలా..
1న చార్జిషీట్ విడుదల చేయనున్నారు. 2, 3 తేదీల్లో అసెంబ్లీల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు, కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ప్రచారం చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కనీసం 2,000 మంది సభ్యులతో సభ నిర్వహించనున్నారు. ఈ సభలకు రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి తీసుకు రానున్నారు.