BJP: చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని, ఏమైంది?.. ఎంపీ డీకే అరుణ ఫైర్
సమస్యలు చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడేమయ్యారని మహబూబ్‌నగర్(Mahaboob Nagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) ఎద్దేవా చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సమస్యలు చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడేమయ్యారని మహబూబ్‌నగర్(Mahaboob Nagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) ఎద్దేవా చేశారు. బుధవారం గద్వాల(Gadwala)లో 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల(SSA Employees) దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె.. భారతీయ జనతా పార్టీ తరపున ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షకు మద్దతు తెలపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి అని, వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామన్నోళ్లు ఇప్పుడేం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని, సాధ్యమైనంత త్వరలో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇక అంతవరకు బీజేపీ తరపున ఉద్యోగులకు అండగ ఉంటాం.. పోరాడుతాం.. ప్రశ్నిస్తాం! అని డీకే అరుణ భరోసా ఇచ్చారు.