6, 7 తేదీల్లో ఈవో గ్రేడ్-1 పరీక్ష.. అభ్యర్థులకు ముఖ్య గమనిక
ఈ నెల 6, 7 తేదీల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్‌వైజర్) గ్రేడ్ 1 పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది....
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమెన్‌డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్‌వైజర్) గ్రేడ్ 1 ఖాళీల భర్తీకి గాను ఈ నెల 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in వెబ్ సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో పెట్టినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.