MLC Kavitha : అక్రమ కేసులకు భయపడం : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ప్రజల పక్షాన గొంతెత్తిని వారిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) అక్రమ కేసులు(Illegal Cases) పెడుతుందని, ఎలాంటి కేసులు పెట్టినా తాము భయపడేదే లేదని.. ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రజల పక్షాన గొంతెత్తిని వారిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) అక్రమ కేసులు(Illegal Cases) పెడుతుందని, ఎలాంటి కేసులు పెట్టినా తాము భయపడేదే లేదని.. ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించి మాట్లాడారు. ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నపై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు.
రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. 12 వేలకు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని విమర్శించారు. అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందన్నారు. మోసపూరిత నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని కవిత హెచ్చరించారు.