KTR: నన్ను ఇబ్బంది పెట్టాలనేదే రేవంత్ ఉద్దేశం.. కేటీఆర్ హాట్ కామెంట్స్
KTR: Revanth's intention is to trouble me.. KTR hot comments
దిశ, వెబ్‌డెస్క్: ఎలాగైన తనను ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇవాళ ఏసీబీ (ACB) కార్యాలయానికి వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డైవర్షన్ పాలిటిక్స్ (Diversion Politics)లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆరోపించారు. తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. ఒక తమ వెంట లాయర్లే లేకపోతే.. తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుతించాలని ఏసీబీ అధికారులను కోరానని కేటీఆర్ అన్నారు.