Emergency Landing: ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
ముంబై (Mumbai) నుంచి విశాఖపట్నం (Vishakhapatnam) వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (Indigo Flight)లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది.
దిశ, వెబ్‌డెస్క్/శంషాబాద్: ముంబై (Mumbai) నుంచి విశాఖపట్నం (Vishakhapatnam) వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (Indigo Flight)లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ హైదరాబాద్ (Hyderabad) ఏటీసీ (ATC) నుంచి పర్మీషన్ తీసుకుని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమమంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సేఫ్ ల్యాండింగ్ (Safe Landing)తో వారంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వరుసగా విమానాలు క్రాష్ అవుతోన్న తరుణంలో ఈ ఘటన ప్రయాణికులను ఎంతగానో భయాదోళనకు గురి చేసింది.