Weather: రాష్ట్రంలో చంపేస్తోన్న చలి.. పలు జిల్లాలో ఘోరంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperatures) కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్రంగా పెరుగుతోందని వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది.

Update: 2025-01-04 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperatures) కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్రంగా పెరుగుతోందని వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతల నమోదులో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా రానున్న రెండు రోజుల్లో దక్షిణాది జిల్లాల కంటే ఉత్తరాది జిల్లాలో చలి తీవ్రత అత్యంత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ (IMD) తెలిపింది. అదేవిధంగా ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండడంతో చలి మరింత పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యల్పంగా కుమురం భీం జిల్లా (Kumuram Bhim District) సిర్పూర్‌, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా (Sanga Reddy District) కోహిర్‌లో 6.9, ఆదిలాబాద్‌ జిల్లా (Adilabad District) బేలలో 7.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీలో 7.2, వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) మోరీన్‌పేటలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆల్గోల్‌లో 7.6, న్యాల్‌కల్‌లో 7.7, కుమురంభీం జిల్లా తిర్యానీలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌ (Hyderabad) పరిధిలో అత్యంత కనిష్ఠంగా హెచ్‌సీయూ (HCU), బీహెచ్ఈఎల్ (BHEL) 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజేంద్రనగర్‌ Rajendra Nagar)లో 9.4, మౌలాలీ (Moulali)లో 9.6, శివరామ్‌పల్లి (Shivarampally)లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Similar News