ఈ నెల 7 నుంచి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
ఈనెల 7 నుంచి 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఈనెల 7 నుంచి 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన స్టూడెంట్స్ మాత్రమే దీనికి అర్హులని తెలిపారు. కాగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనే విద్యార్థులను కమ్యూనికేట్ చేయాలని అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించారు. టీచర్లు విద్యార్థులకు గైడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థులు ఆయా యాజమాన్యాల నుంచి బోనఫైడ్, ఐడీ కార్డును తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు, గైడ్ టీచర్లు ఈనెల 6న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ట్రాన్స్ పోర్ట్, వసతికి కమిటీలను వేసినట్లు స్పష్టంచేశారు. ట్రాన్స్ పోర్ట్‌కు 9440450546/9490147099 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అలాగే వసతికి సంబంధించిన కమిటీకి 9948697363/7799317522 నంబర్లకు సంప్రదించాలన్నారు.