BRSకు బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఇద్దరు కీలక నేతలు..

ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Update: 2023-11-17 08:05 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి, బీఆర్ఎస్ సీనియర్ నేత మంద జగన్నాథం, ఆయన కుమారుడు మంద శ్రీనాథ్ కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలంపూర్ టిక్కెట్‌ను తన కుమారుడికి కేటాయించాలి అని పలుమార్లు అధిష్టానానికి మంద రిక్వెస్ట్ చేశారు. అయితే నాలుగు సార్లు ఎంపీగా గెలిచి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెగించి కొట్లాడిన తనను కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇతరులకు ప్రాధాన్యతను ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి ఎస్సీ రిజర్వుడు స్థానంలో తన ఆధిపత్యాన్ని చలాయించడం, సిట్టింగ్‌ను కాదని వ్యక్తిగత సహాయకునికి చివరికి టిక్కెట్ తెచ్చుకోవడం పట్ల మంద మనస్థాపానికి గురయ్యారు.

ఈ పరిణామాల దృష్ట్యా జగన్నాథం, ఆయన కుమారుడు మంద శ్రీనాథ్ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్‌తో పాటు కలిశారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మందా జగన్నాథం సిద్ధం అయ్యారు. తన కుమారుడు శ్రీనాథ్‌తో కలిసి గాంధీభవన్‌కు చేరుకున్నారు. మరో గంటలో మంద జగన్నాథం, శ్రీనాథ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయన కూడా గాంధీభవన్ చేరుకున్నారు.

Tags:    

Similar News