BRSకు బిగ్ షాక్.. కారు దిగేందుకు పది మంది కార్పొరేటర్లు రెడీ!

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

Update: 2024-04-19 08:53 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కేసుల పరంపరతో కరీంనగర్‌లో ప్రతిష్ట దెబ్బతిన్న బీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. పదిమంది కార్పొరేటర్లు ఏకకాలంలో పార్టి మారి బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే పార్టీకి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న పదిమంది కార్పొరేటర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకోసం సదరు కార్పొరేటర్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు టచ్ లోకి వెళ్లిపోయారు. అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే పార్టి మారేందుకు రెడీ అయినట్లు సమాచారం.


Similar News