Bandi Sanjay: ‘ధరణి‘ పేరుతో కొంపలు ముంచారు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
‘ధరణి’ (Dharani) పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS) కొంపలు ముంచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ధరణి’ (Dharani) పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS) కొంపలు ముంచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సిరిసిల్ల (Sirisilla)లో దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తన పదవి ప్రజలు పెట్టిన భిక్ష అంటూ ఎమోషనల్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రిని అడ్డం పెట్టుకుని సిరిసిల్ల కేంద్రంగా విచ్చలవిడిగా భూములను కబ్జా చేశారని ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని దివ్యాంగుల కాలనీని నిర్మించాలని అన్నారు. ఇష్టారీతిన మాట్లాడితే సమాజం ఎవరినీ గుర్తించదంటూ.. కేటీఆర్‌ను ఉద్దేశించి ఇండైరెక్ట్‌గా సైటర్లు వేశారు. తన పదవి ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన అంటూ ‘ధరణి’ని ప్రవేశపెట్టి అందరి కొంపలు ముంచారని.. వేల ఎకరాలను బీఆర్ఎస్ (BRS) నేతలు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. ‘ధరణి’ (Dharani)తో లాభపడింది రైతులు కాదని.. కేసీఆర్ కుటుంబమే అన్ని రకాలుగా లాభపడిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు ఏమాత్రం వెనకడుగు వేయొద్దని.. తమ సహకారం ఎల్లప్పుడు వారికి ఉంటుందని బండి సంజయ్ అన్నారు.