సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ పగబట్టారు.. అసెంబ్లీలో సినిమా లెవల్ కథ అల్లారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్రమంత్రి బండి సంజాయ్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్పీచ్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

Update: 2024-12-22 08:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి బండి సంజాయ్(Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ స్పీచ్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu film industry)పై పగ బట్టి నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తాను విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాసుకొచ్చారు. పుష్ప-2(Pushpa-2) సినిమా విడుదల వేల సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనలో మహిళ మృతి చెందడాన్ని ప్రతి ఒక్కరు ఖండించారిని గుర్తు చేశారు. అలాగే తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న బాలుడు శ్రీతేజ్(Shritej) కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని.. అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారని చెప్పుకొచ్చారు.

సినిమా లేవల్‌లో కథ అల్లి.. మళ్లీ సమస్యను సృష్టించారు

సమస్య ముగిసిన తర్వాత సీఎం అసెంబ్లీ(Assembly)లో ఎంఐఎం(MIM) సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని.. సినిమా లేవల్‌లో కథ అల్లి.. మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటని మండి పడ్డారు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళికతో పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని.. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందని.. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని ఈ సందర్భం బండి సంజయ్ విమర్శలు చేశారు.

గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే ఎందుకు స్పందించలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు చనిపోతే.. సీఎం(CM) హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఎప్పుడైన వారి కుటుంబాలను పరామార్శించారా అని బండి ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం విద్యార్థులు చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా.. మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా అంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు సినిమా ఇండస్ట్రీ(Film industry) విషయంలో కక్ష సాధింపు చర్యలను వీడాలన్నారు. చట్టం చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్లుగా వినియోగించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నట్లు బండి పేర్కొన్నారు.


Similar News