విపత్తుల నివారణపై DRF అవగాహన
విపత్తులు సంభవించినపుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విపత్తులు సంభవించినపుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సోమవారం అధికారులు ఎస్ఎఫ్ఓ శ్యాంసుందర్ రెడ్డి, డీఆర్ఎఫ్ మెనేజర్ హ్యారీలీనస్ సారథ్యంలో అంబర్‌పేట్ శివంరోడ్డు దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ షోరూంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆయా సందర్భాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్వహించే రెస్క్యూ ఆపరేషన్లలో వినియోగించే వస్తువులను వారికి చూపించి వాటిని వినియోగించి తమను తాము అలాగే పొరుగు వారిని కాపాడుకునే ఉపాయాలను నేర్పించారు. షాపింగ్ మాల్స్‌లో కచ్చితంగా ఫైర్ సెఫ్టీలను పాటించాలని డీఆర్ఎఫ్ అధికారులు సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రీను యాదవ్, ఐలయ్య, అంజిరెడ్డి, మల్లేష్, వెంకటేశ్వర్లు, శివాజీ, షాపింగ్ మాల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.