మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించడం చర్చనీ యాంశమైంది.

Update: 2024-04-15 06:02 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించడం చర్చనీ యాంశమైంది. మద్యం మత్తు లో ఏఆర్ కానిస్టేబుల్ స్కూటీపై వెళ్తూ కారులో వెళ్తున్న వారిపై దాడి చేశాడు. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం గేటు ముందే ఏఆర్ కానిస్టేబుల్ ఆయూబ్ స్కూటీపై వెళ్లుతుం డగా కారులో సాయి తేజ ఫ్యామిలీతో అటువైపు వెలుతు న్నారు. స్కూటీని కారు ఢీకొట్టిం దని కారును ఆపి నడిపిస్తున్న వ్యక్తి నుంచి బలవంతంగా ఆర్సీ తీసుకున్నాడు. కారులో ఉన్న మహిళలు కానిస్టేబుల్‌ను బ్రతిమిలాడిన వినిపించుకోలేదు.

దీంతో కారులో ఉన్న వారిపై దురుసుగా ప్రవర్తించి, దాడి చేశాడని బాధితులు ఆరోపించారు. సీపీ కార్యాలయం ఎదుట ఆరగంట పాటు ఈ తతంగం జరిగిన అక్కడి పోలీసులు పట్టించుకో లేదు. ఒకటవ టౌన్ ఎస్‌హెచ్ వో విజయ్ బాబు విధులు ముగించుకొని ఇంటికి వెలుతుం డగా పోలీసు వాహనం అపి అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఏఆర్ కానిస్టే బుల్ ఆయూబ్ నుంచి ఆర్సీ తీసుకొని కారులో ఉన్న వారికి ఇచ్చారు. అక్కడి నుంచి ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయగా మద్యం సేవించాడని ఎస్‌హెచ్‌వో తెలిపారు. బాధితులు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీపీ కార్యాలయం ఎదుట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి విచా రణ చేపట్టి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.


Similar News