ఘనంగా కొనసాగుతున్న ఉత్సవాలు

గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Update: 2024-10-06 05:50 GMT

దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిన్నారంలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొడకంచి గ్రామంలో గల అమ్మవారి సన్నిధిలో కాంగ్రెస్ యువజన నాయకులు ప్రవీణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. ఉదయం, రాత్రి సమయాల్లో అమ్మవారి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Tags:    

Similar News