సంగాయిపేటలో విద్యుత్ ఘాతంతో రైతు మృతి

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు వైర్ వేయడానికి జంపర్ ఆఫ్ చేస్తుండగా అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ పై రైతు పడడంతో విద్యుత్ ఘాతం తో మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం కొల్చారం మండలం సంగయ్యపేట శివారులో జరిగింది.

Update: 2024-12-23 11:29 GMT

దిశ, కొల్చారం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు వైర్ వేయడానికి జంపర్ ఆఫ్ చేస్తుండగా అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ పై రైతు పడడంతో విద్యుత్ ఘాతం తో మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం కొల్చారం మండలం సంగయ్యపేట శివారులో జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముకిరే మల్లయ్య (60) తన వ్యవసాయ పొలం వద్ద వరి నారుకు నీరు పారించడానికి వెళ్లగా ఒక ఫీజులో కరెంటు రాకపోవడంతో విద్యుత్ ట్రాన్స్ఫారం వద్దకు వెళ్లి చూస్తుండగా ఫీజు వైరు పోవడంతో ఏ బి స్విచ్ జంపర్ ఆఫ్ చేస్తుండగా అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ పై పడిపోయాడు. దీంతో విద్యుత్ ఘాతానికి గురైన మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సత్యమ్మ, కుమారుడు నరసింహులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై గౌస్ పాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News