పేకాటస్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురుని అరెస్ట్ చేశారు.

Update: 2024-12-23 13:34 GMT

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురుని అరెస్ట్ చేశారు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండలం బూరుగుగుంపు గ్రామ శివారులోని ఓ పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేయగా వారి వద్ద నుండి రూ.72 వేల నగదు, 6 సెల్ ఫోన్లు, 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని దమ్మపేట పోలీస్ స్టేషన్ కు అప్ప చెప్పినట్లు తెలిపారు. పేకాటలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 


Similar News