కేసు నమోదు కావడంతో భయంతో వ్యక్తి ఆత్మహత్య

జంతువుల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తో ఆదివారం జంగిటి నవీన్ అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-23 14:01 GMT

దిశ, కోరుట్ల : జంతువుల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తో ఆదివారం జంగిటి నవీన్ అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించిన విషయం తెలిసిందే. కాగా మృతుడిని వేటకు తీసుకెళ్లిన జంగిటి చిన్న నరసయ్య అలియాస్ ఇచ్చన్న సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...ఆదివారం జంగిటి చిన్న నరసయ్య అలియాస్ ఇచ్చన్న వేటకు వెళ్దామని నవీన్ అనే వ్యక్తిని తీసుకెళ్లగా అతను కరెంట్ షాక్తో మృతి చెందాడు.

    కాగా మృతుని భార్య ఫిర్యాదు మేరకు నరసయ్యపై పోలీసులు కేసు నమోదు చేయగా భయభ్రాంతులకు గురైన చిన్న నరసయ్య రాజేశ్వర్ రావు పేట గ్రామ శివారులోని సంగ గంగారాం పొలంలో మామిడి చెట్టుకు ఉరివేసుకొని మరణించారు. నరసయ్య భార్య జంగిటి పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Similar News