Folk singer Mallik Teja: అత్యాచారం కేసులో ఫోక్ సింగర్ మల్లిక్ తేజకు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

తెలంగాణ జానపద సింగర్, రైటర్(Telangana folk singer, writer) మల్లిక్ తేజ(Mallik Teja) అవకాశాల పేరుతో తనను లైంగికంగా వేధించడాని ఓ యువతి గత ఆదివారం జగిత్యాల పోలీస్ స్టేషన్‌(Jagtial Police Station)లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-06 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జానపద సింగర్, రైటర్(Telangana folk singer, writer) మల్లిక్ తేజ(Mallik Teja) అవకాశాల పేరుతో తనను లైంగికంగా వేధించడాని ఓ యువతి గత ఆదివారం జగిత్యాల పోలీస్ స్టేషన్‌(Jagtial Police Station)లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.తేజ తనను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో తాజాగా మల్లిక్ తేజకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.ఆయనకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేసింది.డబ్బుల కోసమే యువతి తనను ఇబ్బందులకు గురిచేసిందని కేసు విచారణ సందర్భంగా తేజ పేర్కొన్నారు.ఆమె ఫోక్ సింగర్ గా ఎదగడానికి తేజనే కారణమని,స్టార్ డమ్ వచ్చిన తర్వాత యువతి తేజపై అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసిందని తేజ తరఫు లాయర్ వాదనలో వినిపించారు . ఈ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తేజకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 


Similar News