Viral: వీపు రుద్దమన్నందుకు భర్త తల పగలకొట్టిన భార్య..! నెట్టింట వైరల్

భర్త వీపు రుద్దమని అడిగినందుకు ఓ భార్య తల పగలకొట్టిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.

Update: 2024-10-06 06:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భర్త వీపు రుద్దమని అడిగినందుకు ఓ భార్య తల పగలకొట్టిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. శివ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ లో నివాసం ఉంటున్నాడు. ఉదయం స్నానం చేసే సమయంలో వీపు రుద్దాలని అడుగుతూ.. గట్టిగా అరిచాడు. దీంతో భార్య గట్టిగా అరవకండి చుట్టూ ప్రక్కల వాళ్లు వింటారని వారించింది. భార్య మాటలు విన్న భర్త మరోసారి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తురాలైన భార్య ఓ ఐరన్ రాడ్ తీసుకొని భర్త తలపై దాడి చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే అతడి గాయానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. భార్య దాడి చేయడంతో శివ తలకు తీవ్ర గాయం అయ్యింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతేగాక దాడి చేసిన భార్యపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గాయపడ్డ శివ ఫిర్యాదుతో తన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.


Similar News