అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

Update: 2024-10-06 06:53 GMT

దిశ,అలంపూర్ టౌన్: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం అధికారికంగా ప్రభుత్వం తరుపున కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కుటుంబ సమేతంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేందర్ కుమార్, పాలక మండలి చైర్మన్ నాగేశ్వర రెడ్డి, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా కుటంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పట్టు వస్త్రాలు అందజేసి పూజలు చేశారు.

ఈఓ, చైర్మన్ కలెక్టర్కు తీర్థ ప్రసాదాల అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలంపూర్‌తో తనకు విడదీయరాని బంధం ఉందని, తన తల్లి గారిది అలంపూర్ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని కోరారు. దేవస్థాన అభివృద్ది గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.




 



Similar News