జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా హరిహరరావు

అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా సీనియర్ అడ్వకేట్ ఎం. హరి హర రావును నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-06 06:16 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా సీనియర్ అడ్వకేట్ ఎం. హరిహరరావును నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం తరపున సివిల్ కేసులను చూసేందుకు ఇతన్ని నియమించినట్లు తెలుస్తోంది. అయితే పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడు సంవత్సరాల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీపీగా కొనసాగనున్నట్లు జీఓ జారీ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వేము నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డిలు ఎం. హరి హర రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News