మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు సిద్ధమైన హైదరాబాద్
మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు హైదరాబాద్ సిద్దమైంది.
దిశ, శేరిలింగంపల్లి: మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు హైదరాబాద్ సిద్దమైంది. ఇప్పటికే నగరంలో ఫార్ములా రేసింగ్‌ను నిర్వహించగా తాజాగా ఏబీబీ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్‌నకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం హైటెక్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. భారతదేశంలో మొట్టమొదటి ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేస్ 'హైదరాబాద్ ఈ-ప్రిక్స్ 2023' ను ఫిబ్రవరి 11న ఈ ప్రిక్స్ రేస్ ట్రాక్ వేదికగా నిర్వహించనున్నారు.
ఎలక్ట్రిక్ రేస్ కారు- జెన్ 3 కారులు ఈ రేస్‌లో పాల్గొననున్నాయి. టిక్కెట్‌లను అసెక్ట్స్ జెన్ వెబ్ సైట్ (https://acenstgen.com/), BookMyShowలో అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టికెట్లను మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్,ఆవిష్కరించారు. ప్రపంచంలోనే దిగ్గజ మోటార్‌స్పోర్ట్ మెక్‌లారెన్, మసెరటి హైదరాబాద్ ఫార్ములా-ఈ గ్రిడ్‌లో మొదటిసారిగా పాల్గొనున్నాయి. పోర్షే, జాగ్వార్, నిస్సాన్ జట్లతో 22 మంది డ్రైవర్లతో పోటీపడనున్నారు. రేసుకోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయడంపై అరవింద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలిచిందనన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అక్బర్ ఇబ్రహీం, ఏస్ నెక్స్ట్ జన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
Also Read....