ఎనిమల్ వెల్ఫేర్ సభ్యులు స్వామి స్వయం భగవాన్ మృతి
ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యులు స్వామి స్వయం భగవాన్ దాస్ మృతి పట్ల పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యులు స్వామి స్వయం భగవాన్ దాస్ మృతి పట్ల పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యులుగా స్వామి అందించిన సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ లు స్వామి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా స్వామి భగవాన్ ఎనిమల్ వెల్ఫేర్ కు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఒరిస్సా వరదల సమయంలో మూగ జీవాలకు గ్రాసం అందించడంలో కృషి చేసారని తెలిపారు. జంతు సంరక్షణ రంగంలో భగవాన్ సేవలు అపరమైనవని అన్నారు.