నగరానికి చేరుకున్న అంబేద్కర్ ముని మనవడు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది.

Update: 2023-04-13 14:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ సర్కార్‌ నిర్మించిన విషయం తెలిసిందే. అత్యంత గ్రాండ్‌గా రేపు(ఏప్రిల్ 14న) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ ముని మ‌నువ‌డు ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రమే నగరానికి చేరుకున్నారు. ప్రకాశ్ అంబేద్కర్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరమని వివరించారు.

Also Read...

మంత్రి అప్పలరాజుకు AP CMO వార్నింగ్ 

Tags:    

Similar News