Hyderabad: జైలు నుంచి నేరుగా అక్కడికి వెళ్లిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఈ ఉదయం చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి విడుదల అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఈ ఉదయం చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి విడుదల అయ్యారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య బన్నీని జైలు వెనుక గేటు నుంచి వదిలేశారు. జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్(Geetha Arts office) కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసులో లాయర్లు, పలువురు ప్రముఖులతో మాట్లాడి ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్‌కు వెళ్లారు.
ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Read More : 2024 లో మొత్తం అల్లు అర్జున్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయి?