Allu Arjun: అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని ఆత్మహత్యాయత్నం

అల్లు అర్జున్(Allu Arjun) కోసం ఓ అభిమాని(fan) ఆత్మహత్యాయత్నానికి(attempted suicide) పాల్పడ్డాడు.

Update: 2024-12-14 04:44 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) కోసం ఓ అభిమాని(fan) ఆత్మహత్యాయత్నానికి(attempted suicide) పాల్పడ్డాడు.పోలీసులు అతన్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్(police station) కు తరలించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టు(Nampally Court) 14 రోజుల రిమాండ్(Remand) విధించిండంతో పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు(High Court) మధ్యంతర బెయిల్(Bail) మంజూరు చేసినా సాయంత్రం ఆలస్యం అవ్వడంతో జైలు అధికారులు(jail authorities) విడుదల చేయలేదు.

దీంతో అల్లు అర్జున్ రాత్రంతా చంచల్ గూడ జైలులో ఉండిపోడంతో ఓ అభిమాని తీవ్ర మనస్థాపం(upset) చెందాడు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని ఈ తెల్లవారుజామున చంచల్ గూడ జైలు గేటు వద్ద ఆత్మహత్యకు(commit suicide) యత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకొని ఒంటిపై నీళ్లు పోశారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ తో అల్లు అర్జున్ ఇవాళ ఉదయం విడుదల అయ్యాడు.

Tags:    

Similar News