TS Assembly: సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

సభలో సభ్యులందరికి మాట్లాడే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు.

Update: 2024-07-24 13:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సభలో సభ్యులందరికి మాట్లాడే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారన్నారు. ప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నప్పటికీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారి పోయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదని, సీఎం హాఫ్ నాలెడ్జితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయ పడుతుందన్నారు.

Tags:    

Similar News