ALERT : తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షం.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

అప్పుడే ఎండ, అప్పటికప్పుడే వాతావరణం చల్లబడి వర్షాలు పడతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2023-05-25 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే ఎండ, అప్పటికప్పుడే వాతావరణం చల్లబడి వర్షాలు పడతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చిని వాతావరణ శాఖ పేర్కొంది.

ఏపీలోనూ ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ రెయిన్ పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఓ వైపు ఎండలు రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Tags:    

Similar News