సాక్షులతో సహా కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున.. కొండా సురేఖపై షాకింగ్ కామెంట్స్

అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సినీ నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) దాఖలు

Update: 2024-10-08 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సినీ నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల విచారించిన నాంపల్లి కోర్టు(Nampally Court) ఆయన (నాగార్జున) స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నాగార్జున మంగళవారం హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జునతో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లందని ఆ పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు.

ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు. తాజాగా.. కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో.. ‘మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని నాగార్జున కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో పేర్కొన్నారు. కాగా, కోర్టుకు నాగార్జునతో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కూడా వచ్చారు.


Similar News