తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం: కాసాని జ్ఞానేశ్వర్
ఉద్యమ స్థాయిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమ స్థాయిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో పార్లమెంట్ పరిశీలకులకు, జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడుగు, బలహీనవర్గాల పేదలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన టీడీపీకి తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం అన్నారు.
రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ సభ్యత్వాలను నమోదు చేసి, వార్డు స్థాయి నుంచి మండల కమిటీల నియామకం వరకు పార్టీ సంస్థాగత ప్రక్రియను విధిగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కేడర్లో నైరాశ్యం నెలకొన్నది వాస్తవమేనని, నాయకత్వం ముందుకు వస్తే పార్టీ శ్రేణులు కదం తొక్కేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.