బెజ్జూర్ అడవుల్లో పులి సంచారం
బెజ్జూర్ రేంజ్ సులుగు పెళ్లి సెక్షన్లోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సోమవారం అటవీ అధికారులు తెలిపారు.
దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ రేంజ్ సులుగు పెళ్లి సెక్షన్లోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సోమవారం అటవీ అధికారులు తెలిపారు. పెంచికలపేట మండలం జైహింద్పూర్ అటవీ ప్రాంతం నుంచి సులుగు పెళ్లి అటవీ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా పులి వెళ్లినట్లు తెలిపారు. బెజ్జూర్ రేంజ్ లోని సులుగుపల్లి నుండి సిద్దాపూర్ అటవీ ప్రాంతానికి మత్తడి వైపు వెళ్లినట్లు తెలిపారు. పులి కదలికలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి అడుగులను గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు.