ఆదిలాబాద్ జిల్లాకు రానున్న ఏకసభ్య కమిషన్ ప్రతినిధి...
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డా.షమీమ్ అక్తర్ ఈ నెల 3 జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డా.షమీమ్ అక్తర్ ఈ నెల 3 జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3న షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరగనున్న ఈ బహిరంగ విచారణలో ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు, ప్రజలు తమ అభిప్రాయాలను, వినతులను సమర్పించవచ్చునని తెలిపారు.