సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్
జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజ్ చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మధుకర్ ను కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ,జన్నారం : జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజ్ చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మధుకర్ ను కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు మధుకర్ ను సస్పెండ్ చేసినట్లు జన్నారం ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు శనివారం తెలిపారు. జన్నారం ఫారెస్ట్ రేంజ్లోని పైడిపల్లి అటవీ బీటులో ఈ మధ్య కాలంలో కలప అక్రమ రవాణా ఎక్కువగా జరిగిందని, కలప స్మగ్లర్లతో కుమ్మక్కయ్యాడని, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే పలు ఆరోపణ నేపథ్యంలో చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.