త్వరపడండి.. స్మైల్ ఫౌండేషన్ లో ఉద్యోగ అవకాశాలు..

స్మైల్ ఫౌండేషన్ సంస్థలో 10 వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసెస్ చెప్పే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

Update: 2025-01-06 08:16 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : స్మైల్ ఫౌండేషన్ సంస్థలో 10 వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసెస్ చెప్పే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్ మండలాలు, ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, జైనూరు, కాగజ్నగర్ మండలాల్లో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ బోధించే సామర్థ్యం ఉన్నవారు ఎంఈడీ, బీఈడీ, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఆర్టీగా చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రోజుకు రెండు గంటలు క్లాసెస్ చెప్పగలమన్న నమ్మకం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తులను 9947612411 కు తమ రెజ్యూమ్ ను వాట్సప్ ద్వారా పంపాలని సూచించారు. ప్రతి మండలంలో ఇద్దరు చొప్పున నియమిస్తామని, వారికి ప్రతి నెలా రూ. 15000 చెల్లిస్తామన్నారు.


Similar News