ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా
ఉపాధి,ఉద్యోగాల కోసం రోజూ ఎన్నో విధాలుగా పోటీ పరీక్షల్లో,ఇతర
దిశ, ఆదిలాబాద్ : ఉపాధి,ఉద్యోగాల కోసం రోజూ ఎన్నో విధాలుగా పోటీ పరీక్షల్లో,ఇతర రంగాలలో పోటీ పడుతున్న యువత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలను కల్పించేందుకు పట్టణంలోని STU ఎస్టీయూ భవన్ లో సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ లో యువతకు ఇదొక మంచి అవకాశమని,అగ్నివీర్ వాయు పథకంను ఇంటర్,డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 27 వరకు వీటి కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ పరీక్ష మార్చి 22న ఉంటుందని, 01 జనవరి 2005,01 జూలై 2008 సంవత్సరం మధ్య జన్మించిన అర్హత గల అవివాహిత స్త్రీ,పురుష అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అగ్నివీర్,ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు,తదితరులు తదితరులు ఉన్నారు.