అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని ముధోల్ ఎమ్యెల్యే పవర్ రామరావు పటేల్ అన్నారు.
దిశ, ముధోల్ : నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని ముధోల్ ఎమ్యెల్యే పవర్ రామరావు పటేల్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ లోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని అన్నారు. అలాగే .ప్రస్తుత కాలంలో ఆడ బిడ్డలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఆడ బిడ్డలను విధిగా చదివించాలని అన్నారు. కల్యాణ లక్ష్మి ,షాదీ ముభారక్ చెక్కులను పెండింగ్ లో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. దశలవారీగా అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, బీజేపీ మండల అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు నర్సాగౌడ్, రమేష్, తాటేవార్. , ధరంపురి సుదర్శన్, బత్తిని సాయి, దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.