హరితహారం మొక్కలకు రక్షణ కరువు..!

హరితహారం మొక్కలకు,చెట్లకు క్యాతన్ పల్లి పురపాలికలో రక్షణ

Update: 2025-01-09 05:37 GMT

దిశ,రామకృష్ణాపూర్: హరితహారం మొక్కలకు,చెట్లకు క్యాతన్ పల్లి పురపాలికలో రక్షణ కరువైంది.రాష్ట్ర ప్రభుత్వం వేల రూపాయలను వెచ్చించి హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను పంపిణీ చేసి నాటుతుంటే మరికొందరు వాటిని నరికేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.పట్టణంలోని ఒకటవ వార్డు తారకరామ కాలనీ బతుకమ్మ గ్రౌండ్ కు అనుకోని ఉన్నాయనో,మరేదో కారణంగా పచ్చదనంపై వేటు వేసి హరితహారంలో నాటిన కొన్ని రకాల పండ్ల మొక్కను,పెద్ద చెట్లను కూడా తొలగించారు.గతంలో ఇదే ఏరియాలో హరితహారంలో నాటిన ఒక వేప చెట్టును కూడా తొలగించారు.

పట్టించుకోని ఎన్విరాన్మెంట్ అధికారి..

రామకృష్ణాపూర్ పట్టణానికి సింగరేణి కార్మిక క్షేత్రాలు ఆనుకోని ఉండటం వల్ల ఒకవైపు కాలుష్యం పెరుగుతుంది.దాని దుష్పరిణామాలను నిలువరించి,పర్యావరణానికి మేలు చేకూర్చడంలో చెట్లు పోషిస్తున్న పాత్ర ఎంతో ఉంది.ఇలాంటి విలువైన చెట్లను కాపాడుకోవాల్సింది పోయి, నిర్దాక్షిణ్యంగా చెట్లను నరికి వేస్తున్నారు.పురపాలికల్లో పర్యావరణానికి సంబంధించిన ఓ ప్రత్యేక అధికారిని నియమించినప్పటికీ ఫలితం శూన్యంగా ఉంది. పట్టణంలో హరితహారం మొక్కలు,ఇతర చెట్ల నరికివేతకు గురవుతున్న ప్రత్యేక అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

వేరే ప్రాంతంలో హరితహారం చెట్లను తినివేసాయని ఏకంగా అధికారులు ఓ మేకను అరెస్ట్ చేయించారు.ఇక్కడ మాత్రం అధికారులు చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు.అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెలినప్పటికి వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చెట్లను కాపాడవలసిన బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు మున్సిపాలిటీ అధికారులు కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.పర్యవేక్షణ లేక,చర్యలు తీసుకోలేని పరిస్థితి.చెట్ల నరికివేత పెద్ద నేరమేమీ కాదనే భావన ప్రజల్లో రోజురోజుకు పెరుగిపోతుంది.మరి దీనిపై పుర, అటవీశాఖ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Similar News