ఇందాని జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

వాంకిడి మండలంలోని ఇందాని ఎక్స్ రోడ్డు వద్ద గల ఆర్బీ జిన్నింగ్ మిల్లులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.

Update: 2025-01-09 13:43 GMT

దిశ, వాంకిడి : వాంకిడి మండలంలోని ఇందాని ఎక్స్ రోడ్డు వద్ద గల ఆర్బీ జిన్నింగ్ మిల్లులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం జిన్నింగ్ మిల్లులో పత్తి అన్లోడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి జిన్నింగ్ మిల్లులో నిల్వ ఉన్న పత్తి కుప్పకు అంటుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే స్థానిక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో భారీ నష్టం జరగకుండా నివారించారు. ఈ అగ్ని ప్రమాదంలో పది క్వింటాళ్ల పత్తి దగ్ధం కాగా దాని విలువ సుమారు రూ.75 వేల వరకు ఉంటుందని సీపీఓ పణలాల్ పేర్కొన్నారు. 


Similar News