కరెంట్ కోసం బెల్లంపల్లిలో లొల్లి..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి సింగరేణి క్వార్టర్లకు

Update: 2025-01-07 10:40 GMT

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి సింగరేణి క్వార్టర్లకు యాజమాన్యం విద్యుత్ తొలగింపు పై లొల్లి పుట్టింది. ఉచితంగా కరెంట్ సరఫరా చేయాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ప్రజలు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని కన్నాల బస్తీ, టేకుల బస్తీ, ఇతర బస్తి ప్రజలు మంగళవారం మార్కెట్ రోడ్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అప్పగించిన సింగరేణి క్వార్టర్లకు యజమాన్యం విద్యుత్తు నిలిపివేసిన నేపథ్యంలో బాధిత బస్తీల ప్రజలు, యువకులు పలువురు నాయకులు ఒకటై యజమాన్యం వైఖిరిని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు.

సింగరేణి అధికారులు తీరుపై మండిపడ్డారు. తన ఉద్యోగ జీవితకాలం సింగరేణి అభివృద్ధి కోసం పాటుపడిన రిటైర్డ్ కార్మిక కుటుంబాలకు యజమాన్యం విద్యుత్ నిలిపివేయడం అమానుషమని మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సంఘం నాయకులు అమానుల్లా ఖాన్, కాంగ్రెస్ మైనారిటీ పట్టణ అధ్యక్షుడు గౌస్ విమర్శించారు. సింగరేణి క్వార్టర్లకు తొలగించిన విద్యుత్తును పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఉచితంగా 200 యూనిట్ల పవర్ అందించాలని కోరారు. రిటైర్డ్ కార్మికుల పట్ల మానవత్వం తో వ్యవహరించాలన్నారు. ఇంతకాలం సింగరేణి సంస్థకు చేసిన సేవలను యజమాన్యం పరిగణలోకి తీసుకోవాలన్నారు.

కార్మికుల ఇండ్లకు కరెంటు తొలగింపు పై ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. బేషరతుగా కరెంటు తొలగించిన ఇండ్లకు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి వేశారు. విద్యుత్ కటింగ్ ఉపసంహరించుకోవాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యం చేసుకొని విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల దశలవారీగా అన్ని బస్తీల ప్రజలo ఒక్కటై బలమైన ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ, రిటైర్డ్ కార్మికులు కే మల్లయ్య, ఎం జగన్, లింగయ్య, పి మల్లక్క, ఏ స్వప్న, బి రాజేశ్వరి, జి రామ్నాథ్, పి అనిల్, ఎస్ శంకర్, సమ్మన్న తదితరులు పాల్గొన్నారు.


Similar News