ఇండస్ట్రీయల్ హబ్‌తో దశ మారనున్న వేంపల్లి : మంచిర్యాల ఎమ్మెల్యే

ఇండస్ట్రీయల్ హబ్ గా మారడం తో వేంపల్లి గ్రామం పారిశ్రామికంగా

Update: 2025-01-07 14:03 GMT

దిశ,మంచిర్యాల : ఇండస్ట్రీయల్ హబ్ గా మారడం తో వేంపల్లి గ్రామం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భూ దాతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలపడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను ఇచ్చిన వారికి పరిహారం నెలలోపు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎకరానికి పదమూడున్నర లక్షలు పరిహారంగా చెల్లిస్తామని తెలిపారు.

పరిహారం తో పాటు దసరా నాటికి అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి అప్పగిస్తానని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు తర్వాత భూనిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ఎల్లంపల్లి నిర్వాసితులకు ఇప్పటికి పరిహారం అందలేదని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుపడిన సహించబోమని స్పష్టం చేశారు. విపక్షాలు అభివృద్ధి ని అడ్డుకోవాలనే కుట్ర పన్నాయని ఆరోపించారు. బీజేపీ వ్యాపార పార్టీ ఓట్ల కోసం మతం, జపం చేస్తుందని బీఆర్ఎస్ దుకాణం మూతపడిందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమి చేయలేక పోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అభివృద్ధి , సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు. ప్రజల కు మాట ఇచ్చానంటే ఎట్టిపరిస్థితుల్లో మాట తప్పనని తప్పితే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన మహాప్రస్థానం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో అధికారులు జాప్యం చేయకుండా త్వరగా తిను పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News