హమాలీ చార్జీలను పెంచాలి
హమాలి చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి సివిల్ సప్లైయ్ కార్మికులు ధర్నా నిర్వహించారు.
దిశ, ఆసిఫాబాద్ : హమాలి చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి సివిల్ సప్లైయ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడారు. సివిల్ సప్లైయ్ హమాలీలకు పెరిగిన రేట్ల జీవో ను విడుదల చేసి, దానికి అనుగుణంగా కార్మికులకు చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు అందజేశారు.