డిజిటల్ మీడియా రంగంలో 'దిశ' కు ప్రత్యేక స్థానం

నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే దిశ తెలుగు దినపత్రిక కొత్త ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేస్తూ డిజిటల్ మీడియా రంగంలో పథమ స్థానంలో ఉందని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు (ఐపీఎస్) అన్నారు.

Update: 2025-01-04 10:27 GMT

దిశ,రామకృష్ణాపూర్ : నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే దిశ తెలుగు దినపత్రిక కొత్త ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేస్తూ డిజిటల్ మీడియా రంగంలో పథమ స్థానంలో ఉందని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు (ఐపీఎస్) అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లో దిశ 2025 క్యాలెండర్ ను సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ కలిసి ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రారంభించిన అనతి కాలంలోనే దిశ తెలుగు దినపత్రిక ప్రజల మన్ననలను పొందింది అన్నారు. ప్రజా సమస్యలను నిరంతరం అధికారుల, పాలకుల దృష్టికి తీసుకొని వెళ్తూ వాటి పరిష్కారానికి దిశ పాటు పడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దిశ యజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.


Similar News