ఒక్కరోజులోనే రూ.20 కోట్లు తాగేశారు...

కొత్త సంవత్సరం ఆహ్వాన వేళ... ఆబ్కారీ శాఖ పంట పండింది. గత ఏడాదితో పోలిస్తే 40% పైగా మద్యం అమ్మకాలు పెరిగాయి.

Update: 2025-01-02 04:55 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : కొత్త సంవత్సరం ఆహ్వాన వేళ... ఆబ్కారీ శాఖ పంట పండింది. గత ఏడాదితో పోలిస్తే 40% పైగా మద్యం అమ్మకాలు పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ 31 ఉదయం మొదలు.. 2025 కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఎంట్రీ అయ్యే సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 20 కోట్ల మద్యం తాగేశారు. గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది సుమారు 20 కోట్లు మద్యం అమ్మకాలు జరగడం ఎక్సైజ్ శాఖ అధికారుల్లో సంతోషాన్ని నింపింది.

భారీగా సమకూరిన ఆదాయం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఎక్సైజ్ మద్యం అమ్మకాలు విపరీతంగా నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మీద మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో మూడు కోట్ల 20 లక్షలు, నిర్మల్ జిల్లాలో మూడు కోట్ల ఆరు లక్షలు, మంచిర్యాల జిల్లాలో ఏడు కోట్ల మూడు లక్షలు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు కోట్ల ఐదు లక్షల చొప్పున మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. అయితే సింగరేణి సహా కార్మికులు భారీ మొత్తంలో ఉండే మంచిర్యాల ఒక్క జిల్లాలోని ఏడు కోట్ల కు పైగా మద్యం అమ్మకాలు జరగడం ఆసక్తిగా కనిపిస్తున్నది. ఆ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలను భారీ మొత్తంలో జరుపుకున్నట్లు తెలుస్తున్నది.

ఉదయం నుంచే జోష్..

కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంగా డిసెంబర్ 31 ఉదయం నుంచి జనంలో కనిపించింది. ముఖ్యంగా యూత్ కొత్త సంవత్సరం ఆహ్వాన వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. యువజన సంఘాలు క్లబ్బులు సహా గ్రామాల్లో, పట్టణాల్లో మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు ఎవరికి వారుగా గ్రూపులు ఏర్పాటు చేసుకొని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. చలికాలం అయినప్పటికీ బీర్లు సైతం భారీగానే అమ్ముడయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకలు మద్యం అమ్మకాలతో తాగి ఊగిన విధంగానే జరగడం విశేషం.


Similar News