మెడికల్ కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్..

మెడికల్ కాలేజ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ విద్యార్థులు గురువారం కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

Update: 2025-01-02 07:02 GMT

దిశ, ఆసిఫాబాద్ : మెడికల్ కాలేజ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ విద్యార్థులు గురువారం కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక భోధనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

కనీసం ల్యాబ్ లో సరిపడా సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. ప్రొఫెసర్లను నియమించకుండా మెడికల్ కాలేజ్ ను ఎందుకు ఏర్పాటు చేశారని అధికారులను ప్రశ్నించారు. బోధన ఇతర సౌకర్యాలు లేక డాక్టర్ చదవులను ఎలా పూర్తి చేయాలని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడంతో పాటు కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి ధర్నాకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దిన్ కార్, పీడీఎస్యూ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.


Similar News