గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డా. శివ కృష్ణ..
బోథ్ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డా.శివకృష్ణను నియమిస్తూ టీజీటీడబ్ల్యూఆర్ఈఐ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, ఆదిలాబాద్ : బోథ్ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డా.శివకృష్ణను నియమిస్తూ టీజీటీడబ్ల్యూఆర్ఈఐ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 14 మందికి ప్రమోషన్లు ఇస్తూ డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి శివకృష్ణ ఒక్కరికే అవకాశం లభించింది. కెమిస్ట్రీ లెక్చరర్ గా ఉన్న డా.శివకృష్ణ.. ఇప్పుడు గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా వ్యవహరించనున్నారు. కొత్త ప్రిన్సిపాళ్లకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.