Minister Ponnam : విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
వాంకిడి గిరిజన పాఠశాల విద్యార్థినుల వైద్య ఆరోగ్యానికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud ) తెలిపారు.
దిశ, ఆసిఫాబాద్: వాంకిడి గిరిజన పాఠశాల విద్యార్థినుల వైద్య ఆరోగ్యానికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud ) తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంగళవారం సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha )తో కలిసి పరామర్శించారు. స్థానిక వైద్యులతో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్య విషయాలను ఆరాతీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిల్లో ఇప్పటికే పది మంది కోలుకోగా ముగ్గురు హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని, విద్యార్థినిల ఆరోగ్యం పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థుల వైద్యం కోసం ఐటీడీఏ ద్వారా రూ.7 లక్షల వరకు ఖర్చు చేసిందని, దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. తాగునీటి పరీక్షలో ఎలాంటి కలుషిత సంకేతాలు లేవని, ఫుడ్ రిపోర్ట్ రావాల్సిందని చెప్పారు.