శైలజ కుటుంబానికి న్యాయం చేయాలి
శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
దిశ, ఆసిఫాబాద్ : శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శులు చిరంజీవి, దుర్గం దిన్కార్ మాట్లాడారు.
జిల్లాలోని గురుకుల, ఆశ్రమ సంక్షేమ వసతి గృహాల్లో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, వార్డెన్, హెచ్ఎంలు నాణ్యత లేని సరుకులు తెచ్చి వడ్డిస్తుండటంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు కారణమవుతున్నారని ఆరోపించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఐటీడీఏ పీఓతో పాటు డీటీడీఓను వెంటనే సస్పెండ్ చేశారన్నారు. అలాగే శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియా, ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో తరుచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై సమగ్ర విచారణ జరిపి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.